నారాయణపేట్: కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్
నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారి సశక్తు అభియాన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ను మంగళవారం 10 గంటల సమయంలో మెడికల్ ఆఫీసర్ ప్రతిభా భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఈ క్యాంపు కొనసాగుతుందని, ప్రజలు ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి వ్యాధులు ఉన్న ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి వ్యాధులను గుర్తించి వ్యాధికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తారని తెలిపారు.