విశాఖపట్నం: సింహాచలం వరహాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గరుడసేవ అత్యంత, వైభవంగా అర్చకులు
విశాఖపట్నం సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.