ఒంగోలు అర్బన్: క్రికెట్ బెట్టింగ్ తో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు : జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 12, 2026
క్రికెట్ బెట్టింగ్ ఊబిలో ఇరుక్కుని యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియచేశారు ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైనటువంటి పోలీసు నిఘాతో బెట్టింగ్ భూతాన్ని అనిసివేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ఈ మధ్యకాలంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది అన్నారు బెట్టింగ్ ఊబిలో ఇరుక్కున్నటువంటి యువత వివరాలను తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ తెలియజేశారు