కరీంనగర్: కిసాన్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లోకి రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు నాగుపాము, భయాందోళనకు గురైన స్థానికులు
కరీంనగర్ కిసాన్ నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లోకి రెండు రోజుల వ్యవధిలో నాగుపాము రెండుసార్లు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురైనట్లు బుధవారం తెలిపారు. నిన్న ఓ పాము రావడంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించి పామును పట్టి అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు. మళ్లీ ఈరోజు అపార్ట్మెంట్ లిఫ్ట్ లోకి మరో పాము రావడంతో వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి మళ్లీ అడవికి తరలించారు. తరచూ పాములు రావడంతో భయాందోళనకు గురవుతున్నామన్నారు. మున్సిపల్ అధికారులు చుట్టుపక్కల ఉన్న చెట్లను, చెత్తను తొలగించాలని కోరుతున్నారు.