తాడిపత్రి: పీఏబీఆర్ నార్త్ కెనాల్ నుంచి యాడికి కాలువకు సాగునీటిని విడుదల చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే
యాడికి కాల్వకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నీటిని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పిఎబిఆర్ నార్త్ కెనాల్ ద్వారా క్రిష్టపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి యాడికి కెనాల్కి నీటితో విడుదల చేశారు. చివరి ఆయకట్టకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి కృషి చేస్తున్నారని మండల ప్రజలు కొనియాడుతున్నారు సొంత నిధులతో కాలువల మరమ్మతులు చేయించి సాగునీటిని త్వరగా వచ్చేలా కృషి చేశారని కొనియాడుతున్నారు.