డోన్: సేవల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగికి నిజమైన గుర్తింపు :బేతంచెల్ ఎంపీపీ నాగభూషణం రెడ్డి
Dhone, Nandyal | May 30, 2026 సమాజానికి అందించే సేవల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులకు నిజమైన గుర్తింపు లభిస్తుందని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి అన్నారు. శనివారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోగా విధులు నిర్వహించిన పరమేశ్వర్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరమేశ్వర్ రెడ్డి తన విధుల్లో నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.