నంద్యాల అర్బన్: ఏబీఎన్ రాధాకృష్ణపై నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా,వైసిపి నాయకులు
Nandyal Urban, Nandyal | Apr 9, 2026
నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఎమ్మెల్సీ ఇషాక్ బాషా ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఇషాక్ భాష మీడియాతో మాట్లాడారు