నంద్యాల అర్బన్: నంద్యాలలో గుర్తుతెలియని మహిళ సంచారం, వివరాలు తెలుపాలన్న పోలీసులు
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల మండలం భీమవరం సమీపంలోని పెట్రోల్ బంకు పరిసరాల్లో శనివారం గుర్తుతెలియని మహిళ సంచరిస్తున్నట్లు సీఐ ఈశ్వరయ్య తెలిపారు. ఆమె తన పేరు సంతోషి అని హిందీలో చెబుతోందని, 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి మానసిక స్థితి సరిగా లేనట్లు గమనించామన్నారు. ఈమె బంధువులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.