ఇంటర్మీడియట్ పరీక్షలు చాలా ప్రశాంతంగా, సజావుగా జరుగుతున్నాయని స్క్వాడ్ కం ఎంఈఓ విజయకుమారి అన్నారు. తాడిపత్రిలోని రెండు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఎలాంటి కాపీలు జరగకుండా సజావుగా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కొందరు మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారన్నారు. అది అబద్ధమన్నారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయన్నారు.