రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తోంది : మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కమలాపురం సబ్‌జైలులో ఉన్న వైసీపీ నేత ఇడమడక శ్రీకాంత్‌ను మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ – “ఏం తెలియని అమాయకుడిపై హత్య కేసు నమోదు చేయడం దారుణం. డాబా పెట్టుకుని జీవనోపాధి సాగిస్తున్న వ్యక్తిపై కక్ష సాధింపుతో కేసు పెట్టడం విచారకరం. ఎలాంటి ఘర్షణలు లేని సమయంలో మర్డర్ కేసు ఎలా పెడతారు? ఇది స్పష్టంగా రాజకీయ కక్షసాధింపే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఆరోపించిన రఘురామిరెడ్డి, “ఇలా కొనసాగితే మేము కూడా బ్లూ బుక్ లో రాయాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.