అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు హైవేలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనం బోల్తా పడి గుర్తుతెలియని యువకుడు అక్కడేకక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడు గాయపడడంతో 108 వాహనంలో మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి మొలకలచెరువు ఎస్ఐ నరసింహుడు , పోలీసు సిబ్బంది చేరుకుని మృతి చెందిన గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.