నంద్యాల అర్బన్: బ్రాహ్మణులంటే నాకు ఎప్పటికీ గౌరవమే, బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పిన నంద్యాల వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ భాష
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నంద్యాల వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మంగళవారం బ్రాహ్మణులకు క్షమాపణ చెబుతూ వివరణ ఇచ్చారు. నంద్యాల శ్రీగాయత్రీ మాత ఆలయంలో మంగళవారం బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నాయకులను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కలిసి వివరణ ఇచ్చారు. జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా తాను మాట్లాడడం జరిగిందన్నారు. విధవరాలు అన్న మాట అనగా దానిని వెధవలు అంటూ వక్రీకరించారని అన్నారు