డోన్: బేతంచర్ల మండలంలో అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం
Dhone, Nandyal | Apr 29, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో అరటి తోటలు నేలకువాలి అపార నష్టం జరిగింది. రుద్రవరంకి చెందిన నాగరాజు అనే రైతు 3 ఎకరాల్లో అరటిని సాగు చేయగా గాలులతో కూడిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంట నేలరాలింది. దీంతో దాదాపు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు. అలాగే మామిడి తోటలో అరటి తోటలు నేలకొరగడంతో తీవ్ర నష్టం జరిగిందన్నారు.