కర్నూలు: కుల వివక్ష నిర్మూలనకై కెవిపిఎస్ నినాదం అని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ
కుల వివక్ష నిర్మూలనకై కెవిపిఎస్ నినాదం అనికెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎస్. రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జెండా ఆవిష్కరించారు.ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన కోసం కెవిపిఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని, కులం–మతం లేని సమాజ నిర్మాణం కోసం పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.దళితులపై దాడులు, వివక్ష ఘటనలకు ప్రభుత్వాలు సీరియస్గా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.