బనగానపల్లె: భగీరధుడు త్యాగానికి ప్రతీక : బనగానపల్లె ఎస్సై దుగ్గిరెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉప్పర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్సై దుగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టుదల, త్యాగానికి భగీరథుడు ప్రతీక అని ఆయన కొనియాడారు. భగీరథుడి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భూషన్న, బోర్వెల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.