అంతర్ జిల్లా ఆర్చరీ పోటీల్లో లక్కిరెడ్డిపల్లె అభినయ్ బంగారు పతకం
అన్నమయ్య జిల్లా: లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన సి. అభినయ్ క్రీడా రంగంలో కీర్తి సాధించాడు. కడపలోని నాగార్జున మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న అభినయ్, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద నవంబర్ 7 నుండి 9 వరకు జరిగిన 69వ ఎస్జీఎఫ్ఐ అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీల్లో తన ప్రతిభను చాటాడు. కాంపౌండ్ బౌ అండర్–14 కేటగిరీ టీమ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ బంగారు పతకాన్ని సాధించాడు. అభినయ్ విజయం లక్కిరెడ్డిపల్లె మండలం, కడప జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఉపాధ్యాయులు, కోచ్‌లు, తల్లిదండ్రులు అభినయ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించాలని ఆకా