బనగానపల్లె: బనగానపల్లెలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై ఫోక్సో కేస్ నమోదు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు శుక్రవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను బ్రిడ్జి కిందకు లాక్కెళ్లి వేధించడాన్ని గమనించిన స్థానికులు, నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.