అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు గ్రామపంచాయతీ సిబ్బంది సంయుక్తంగా దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు విడపనకల్లు పీ హె చ్ సీ వైద్యాధికారి జహానా ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి జాతీయ కీటక జనితవ్యాధుల నియంత్రణ కార్యక్రమ కరపత్రాలను పంపిణీ చేశారు.దోమలపై దండయాత్ర పరిసరాల పరిశుభ్రత గురించి పెద్ద ఎత్తున పురవీధులలో నినాదాలు చేసుకుంటూ సిజినల్ వ్యాధుల పైన ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించారు.