మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీద పల్లి వద్ద పెద్దపులి సంచారంతో రైతులు హడలిపోతున్నారు. గ్రామ సమీపంలోని బీడు పొలాలలో ఉన్న నీటి కుంట వద్ద పెద్దపులి పాలముద్రలను గుర్తించిన రైతులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పులి పాద ముద్రలను పరిశీలించి అటువైపు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు.