కడప: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలి: DYFI, KVPS నాయకులు
Kadapa, YSR | Sep 24, 2025 రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాలని DYFI, KVPS నాయకులు తెలిపారు.బుధవారం నాడు కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నందు ఈడి రాజ్యలక్ష్మికి వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, KVPS నగర కార్యదర్శి నరసింహ లు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేస్తామని వారికి ఆర్థిక భరోసా ఇచ్చి స్వయం ఉపాధిని కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన ఇంతవరకు యువతకు రుణాలు లేవు కదా కార్పొరేషన్ లో నిధులు కరువయ్యాయనన్నారు.