మాజీ సీఎం వైయస్ విగ్రహాలను కూల్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 3, 2026
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను రాష్ట్రంలో కూల్చడంపై ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో బూచేపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ విగ్రహాలను కూల్చివేస్తామని ఆరోపించారు. విగ్రహాలు కూల్చే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా నేతకు ఇలా అవమానం జరగడం బాధాకరమని అన్నారు.