ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువు అడవి సమీపంలో శివ భాష్యం సాగర్ ప్రాజెక్టు సమీపంలో పెద్ద పులులు, చిరుత పులులు, సంచరిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు ప్రజలు అటవీ శాఖ అధికారుల అనుమతులు లేకుండా డ్యామ్ దగ్గరికి వెళ్తే జరగరాని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని శివ భాష్యం సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పోచ మల్లికార్జున రెడ్డి ఆత్మకూరు ప్రాంత ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పత్రిక విలేకరుల ద్వారా ప్రజలకు విన్నపించారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాహనాదారులు రైతులు నిషేధమైన అడవి ప్రదేశాలలో సంచరించకుండా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తమ కుటుంబాలతో ఉండాలని తెలియజేశారు.