కొత్తగూడెం: గ్రీన్ ఛానల్ ద్వారా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటCITU ఆధ్వర్యంలో ధర్నా
గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లింపుని చేయాలని దసరా పండుగ లోపే నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి మాట్లాడుతూ తెలంగాణలోనే అతి పెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగ నాడు కార్మికులను పస్తులు ఉంచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు