పుంగనూరు: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు నమోదు. ఎస్సై హరిప్రసాద్,
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంగ్రామంలో భూ వివాదంలో గొడవపడి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని సీతారామయ్య, రంగమ్మ, భాగ్యలక్ష్మి లను కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ నిమిత్తం తాసిల్దార్ ఎదుట హాజరపరచడానికి తీసుకెళుతున్న మహిళ కానిస్టేబుళ్లు వనిత కుమారి, మమత లపై భాగ్యలక్ష్మి తల్లి కన్యాకుమారి అడ్డగించి తన కుమార్తెను బైండ్ ఓవర్ చేస్తారా అంటూ దుర్భాషలాడి వారిపై దాడికి యత్నించి యూనిఫామ్ ను చింపి వేశారు. మహిళా కానిస్టేబుల్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్ ఓ ప్రకటనలో శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలిపారు.