గుంతకల్లు: గుత్తి అర్ఎస్ రోడ్డులో సచివాలయం ఎదురుగా రోడ్డుపై నిలిచిన ట్యాంకర్, ట్రాఫిక్ కు అంతరాయం
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చానుపల్లి క్రాస్ వద్ద సోమవారం స్టీరింగ్ రాడ్ తెగిపోవడంతో ట్యాంకర్ లారీ నడిరోడ్డుపై నిలిచిపోయింది. అనంతపురం నుంచి ఆదోని వైపునకు వెళ్తున్న ట్యాంకర్ లారీ వెళ్తోంది. అయితే సచివాలయం ఎదురుగా రోడ్డు ధ్వంసమై భారీ గుంతలు పడ్డాయి. అది గమనించని ట్యాంకర్ డ్రైవర్ వేగంగా వెళ్లడంతో గుంతల్లో పడి ట్యాంకర్ స్టీరింగ్ రాడ్ తెగిపోయింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ లారీలు మరో రోడ్డు ద్వారా పంపారు. రోడ్లు శిథిలం కావడంతో వాహనాలు పాడిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.