వాంకిడి: కొమురం భీం అడ ప్రాజెక్ట్ 3గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం అడ ప్రాజెక్టులోకి 3,029 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 3 గేట్లను 0.5 మీటర్ల మేర ఎత్తి 3,029 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా శనివారం ఉదయం నాటికి 237.10 మీటర్లకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.545 కు చేరింది.మిషన్ భగీరథ కోసం 38 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు 45,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.