ఒంగోలు అర్బన్: అమరావతి రాజధానిగా కేంద్రం చట్టబద్ధత కల్పించిన వైసీపీ నాయకులు ఇంకా విషయం కక్కుతున్నారు: మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Apr 2, 2026
ఏపి రాజధానిగా అమరావతి కి పార్లమెంట్ లో చట్టబద్దం చేయడం పట్ల ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఒంగోలులో జరిగిన సంబరాల్లో మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఒంగోలులోని రిమ్స్ నుండి కలెక్టరేట్ వరుకూ నగర ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేశారు. అమరావతి కి కేంద్రం చట్టబద్దం చేసినా వైసీపీ నాయకులు ఇంకా విషయం కక్కుతున్నారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.