బోడవాడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో...
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...
ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ... ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు... బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, బోడవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైపు వెళుతున్న ఆర్డినరి ఆర్టీసీ బస్సుని ఎదురుగా వచ్చిన ఎక్స్ ప్రెస్ బస్సు బలంగా ఢీకొని ప్రక్కనుండి రాసుకుంటూ పోవడంతో ఈప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.