భీమవరం: కలెక్టరేట్ ను భీమవరం AMCలోనే నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోపాలన్ డిమాండ్
కలెక్టరేట్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో వామపక్షపార్టీలు, సిపిఎం, సిపిఐ, ఎంసిపిఐయు, ఫార్వర్డ్ బ్లాక్, ప్రజాసంఘాలు భీమవరంలోని ఎ.ఎం.సిలోని కలక్టరేట్ స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ సంర్భంగా సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ మాట్లాడుతూ.. భీమవరం మార్కెట్ యార్డు కలెక్టరేట్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా అనువైన ప్రాంతం అన్నారు. నిర్మాణానికి అవసరమైన స్థలం ఇక్కడ ఉందన్నారు. కొద్దిమేర గొడౌన్స్ ఉన్నా ఎక్కువ భాగం ఖాళీగా గడ్డి, చెట్లతో నిండి ఉందన్నారు.