కర్నూలు: గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను సందర్శించిన: కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండా వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సందర్శించారు. గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైట్ లోని అప్పర్ రిజర్వాయర్, అప్పర్ ఇన్ టేక్ పాయింట్, ప్రాజెక్ట్ సైట్,పవర్ హౌస్ తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు..ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనితీరు, రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి, పంపింగ్ ప్రక్రియల గురించి జిల్లా కలెక్టర్ కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.1680 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే మొట్టమొదటి