సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టరేట్లో శ్రమదానం, పాల్గొన్న అదనపు కలెక్టర్, మున్సిపల్ కలెక్టరేట్ సిబ్బంది
సంగారెడ్డి కలెక్టరేట్లో గురువారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. శ్రమదాన కార్యక్రమంలో అదన కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తమ సిబ్బందితో పాల్గొని కలెక్టరేట్ వెనకాల పార్కులో గల పిచ్చి మొక్కలు తొలగించారు. కలెక్టరేట్ వెనకాల గల భూమిని చదును చేసి అందరికి అందుబాటులో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ శ్రమదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు.