ఇచ్చోడ: ఇచ్చోడ పైప్ స్టేషన్ వద్ద రోడ్డు ప్రమాదం,ఒకరికి తీవ్ర గాయాలు..ఆసుపత్రికి తరలింపు
ఇచ్చోడ మండల కేంద్రంలోని పైర్ స్టేషన్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బులెరో పికప్ వాహనం ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బులెరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ అసువత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.ఈ సంఘటనలో బులెరో వాహనం నుజ్జునుజ్జయింది.