నందికోట్కూరు: మారుతి నగర్ లో సిపిఐ ప్రజా సమస్యల ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాం మూర్తి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హాజీ నగర్,మారుతినగర్ సిపిఐ ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర ను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి.రఘు రామ్మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మారుతి నగర్, మాజీ నగర్ కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాటామంతి జరపగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మారుతి నగర్ కాలనీలో అన్యాక్రాంతమైన ఇళ్ల స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి కేటాయించాలని కోరారు. కాలనీలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్