అనంతపురం అర్బన్: కల్లూరు వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి గుర్తింపు : రైల్వే ఎస్సై వెంకటేష్ వెల్లడి
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కల్లూరు యార్డ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటనకు సంబంధించి మృతుని ఆచూకీని గుర్తించడం జరిగిందని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ గురువారం ఉదయం వివరాలను వెల్లడించారు. మృతుడు కల్లూరుకు చెందిన మహబూబ్ బాషా అని వారి కుటుంబ సభ్యులు గుర్తించారని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు.