పటాన్చెరు: ప్రతి భారతీయుని మనసులో దేశభక్తి జ్వాలలను రగిలించే గీతం వందేమాతర గేయం : ప్రధానోపాధ్యాయురాలు శారద
వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముత్తంగి ZPHS లో విద్యార్థులు శుక్రవారం సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించి దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శారద మాట్లాడుతూ... వందేమాతరం గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ప్రతి భారతీయుని మనసులో దేశభక్తి జ్వాలలను రగిలించే గీతమని అన్నారు. జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో నిరంతరం నిర్వహించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.