సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అనకాపల్లి వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం డిమాండ్
అనకాపల్లి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వైయస్సార్సిపి స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు హేమంత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్ధులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలన్నారు. విద్యార్ధులకు సరిపడా గదులు కేటాయించాలని కోరారు.