నంద్యాల అర్బన్: ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచి ప్రజల్లో సానుకూల అభిప్రాయం తీసుకురావాలి :అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్
Nandyal Urban, Nandyal | May 26, 2026
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి అత్యంత కీలకమని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజల వద్ద విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు.మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పెన్షన్ పంపిణీ విధానం ప్రజల అభిప్రాయ సేకరణ పాదరసక సేవల అమలుపై మున్సిపల్ కమిషనర్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు