సిర్పూర్ టి: గేర్రె గ్రామంలో పరువు హత్య, 8 నెలల గర్భిణీని గొడ్డలితో నరికి చంపిన మామ, కేసు నమోదు
దహేగం మండలం గేర్రె గ్రామంలో శనివారం పరువు హత్య జరిగింది. కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని ఎనిమిది నెలల గర్భిణీ అయినా కోడల్ని మామ గొడ్డలితో నరికి చంపాడు. గత ఏడాది శివార్ల శేఖర్, తలాండి రాణి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు అయినప్పటికీ ప్రేమించిన యువతనే శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. అయితే తన పరువు పోయిందని రగిలిపోతున్న తండ్రి సత్తయ్య కోడలు రాణి నరికి చంపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,