నంద్యాల అర్బన్: నంద్యాలలో ఓ హోటల్లో బిర్యానిలో బొద్దింక, వీడియో వైరల్, తనిఖీలు చేపట్టిన ఫుడ్ ఇన్స్పెక్టర్
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల ఫరూక్ నగర్ లోని క్లాసిక్ బిర్యానీ హౌస్లో చికెన్ రోస్ట్లో బొద్దింక వచ్చిందనే వార్త వైరల్ కాగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆకస్మిక తనిఖీలు చేశారు. హోటల్ వంటగదిని పరిశీలించి, లోపాలను సరిదిద్దుకోవాలని యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీచేస్తూ 15 రోజుల సమయమిచ్చారు. బిర్యానీ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం చెన్నై ల్యాబ్కు పంపారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.