తుక్కులూరు లో నూజివీడు సీడ్స్ చైర్మన్ వెంకట్రామయ్య మృతదేహానికి నివాళులర్పించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Nuzvid, Eluru | Sep 22, 2025 నూజివీడు మండల పరిధిలోని తుక్కులూరు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ వెంకటరామయ్య మృతికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. వెంకట్రామయ్య మృతికి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలు సమయంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. వెంకటరామయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచ్చేసి వెంకటరామయ్య మృతదేహాన్ని వీక్షించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వెంకట్రామయ్య మృతి తీరని లోటుగా నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబు పిలుపుతో పీ4 కార్యక్రమంలో వందలాది కుటుంబాల