ఆళ్లగడ్డ: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అధికారులు విశేష పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కిడంబి వేణుగోపాలం స్వామి ఆధ్వర్యంలో 108 కళాశాలతో అభిషేకాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు