ఆత్మకూరు: సోమశిల జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద, పెన్నా డెల్టాకు 32,650 క్యూసెక్కుల నీరు విడుదల
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. సోమవారం ఎగువ ప్రాంతాల నుంచి 35,600 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 67.212 TMCల నీటిమట్టం నమోదైంది. పెన్నా డెల్టాకు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 32,650 క్యూసెక్కులు, కండలేరుకు 560 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.