ప్రజలకు సౌకర్యం కల్పించే దిశగా అధికారులు చర్యలు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట సింగపూర్ లైన్లో ఎత్తుగా వేసిన సిమెంట్ రహదారిని తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ పాపిరెడ్డి మదనమోహన్ రెడ్డి పర్యవేక్షణలో జేసీబీ సహాయంతో రోడ్డు పగలగొట్టి సరిచేసే పనులు జరుగుతున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రహదారి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.