సత్యవేడు మండల కేంద్రంలో గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన ఎంపీ గురుమూర్తి
సత్యవేడు మండల కేంద్రంలో ఇటీవల అస్వస్థతకు గురైన సత్య వేడు గురుకుల పాఠశాల విద్యార్థులను ఎంపీ గురుమూర్తి ఆదివారం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వారికి అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహంలోని భోజనశాలను ఎంపీ పరిశీలించారు. నాసిరకం కూరగాయలు ఉండడంతో వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.