కామారెడ్డి: బిక్కనూర్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణపై ఎస్పీ సమీక్ష
బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలిశారు. సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, దొంగతనాల అదుపు మరియు శాంతిభద్రతల పరిస్థితిపై సీఐ ఎస్పీకి వివరించారు. నేరాల నియంత్రణలో పోలీసు సిబ్బంది కృషిని ఎస్పీ ప్రశంసించారు.