బనగానపల్లె: కోవెలకుంట్ల సత్యనారాయణ స్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగ, సీసీ కెమెరాలో రికార్డు
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణం గాంధీనగర్లో గల సత్యనారాయణ స్వామి గుడిలో ఆదివారం అర్ధరాత్రి హుండీని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది సోమవారం ఉదయం ఆలయాన్ని సందర్శించగా హుండీ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ దుండగుడు హుండీని తలపై పెట్టుకొని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ హనుమంతు నాయక్ తెలిపారు