నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరులో హజ్రత్ సయ్యద్ హుస్సేన్ వలి స్వామి ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా ముత్తవల్లి గఫర్ మియా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. ఏప్రిల్ 1న గంధం, 2న ఉరుసు, 3న జియారత్ వేడుకలు ఉంటాయన్నారు.