ఆళ్లగడ్డ: తుడుముల దిన్నె గ్రామంలో ఘోరం: యువకుడు పై పెట్రోల్ పోసి నిప్పంటించి దుండగులు పరార్
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ఘోరం జరిగింది, గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు గత రాత్రి మాయలూర్ నుంచి పెట్రోల్ తీసుకుని వస్తుండగా దుండగులు అడ్డగించారు, ఇమ్రాన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు, వెంటనే ఆ యువకుడు పక్కనే ఉన్న రైల్వే గుంతలోని నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు, పోలీసులు క్షతగాత్రుని కోయిలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు