గుంతకల్లు: గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ఘనంగా సీవీ.రామన్, బిపిన్ చంద్రపాల్ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్ల భవనంలో నోబెల్ గ్రహీత, భారత రత్న సి.వి.రామన్ 137వ జయంతి, స్వాతంత్య్ర సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ 167వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సి.వి.రామన్, బిపిన్ చంద్రపాల్ చిత్ర పటాలకు పెన్షనర్ల సంఘం అధ్యక్షడు అబూబకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సి.వి.రామన్ తమిళనాడులో జన్మించారన్నారు. ఆయన వ్యవసాయ కుటుంబంనకు చెందిన వారు. ఆయన 18వ ఏటనే తాను రాసిన కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధన వ్యాసం లండన్ మ్యాగజైన్ లో ప్రచురితమైనదన్నారు.