సంగారెడ్డి: న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తీసుకురావాలి : బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి
న్యాయవాదుల రక్షణ చట్టం కోసం 48 గంటలపాటు నిర్వహిస్తున్న నిరాహార దీక్షను జయప్రదం చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 17 నుంచి 19 వరకు దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.